భార్యలను తీసుకొస్తే మ్యాచ్‌ గెలవరంటూ..

నెలల తరబడి ఇళ్లకి దూరంగా ఉంటూ ఎక్కడ మ్యాచ్‌లంటే అక్కడికి వెళుతుంటారు ఆటగాళ్లు. ఒక్కోసారి మాత్రమే భార్యలను కూడా వెంట తీసుకెళుతుంటారు. సపోర్టే కావచ్చు, అన్ని రోజులు దూరంగా ఎలా ఉండాలనేదే కావచ్చు. అయితే ఇక నుంచి అలాంటి పప్పులేమీ ఉడకవ్ అంటోంది బీసీసీఐ.

విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు సహజంగా క్రికెటర్లు తమ భార్యలతో కలిసి వెళుతుంటారు. అయితే భార్యలకు, ప్రియురాళ్లకు ఇకపై నో ఎంట్రీ బోర్డు పెట్టింది బీసీసీఐ. అందుకుగల కారణాన్ని వివరిస్తూ కొన్ని మ్యాచుల్లో ఆటగాళ్లు ఓడిపోవడానికి వారి కుటుంబసభ్యులే కారణమని చెబుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో కీలకమైన టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

దీన్ని అవకాశంగా తీసుకుని వస్తున్న విమర్శలకు ఊతమిచ్చినట్లవుతుంది పాత పద్దతినే కంటిన్యూ చేస్తే అనేది బీసీసీఐ వాదన. అందుకే ముందు జాగ్రత్తగా మూడు టెస్టుల వరకైనా భార్య లేదా ప్రియురాలి ముద్దూ ముచ్చట్లకు దూరంగా ఉండమని కోరుతోంది.

-ADVT-