వాటి జోలికి ఇక వెళ్ళను : హీరో సుశాంత్

hero sushanth special interview

అక్కినేని బ్యానర్ ఇమేజ్ తన సినిమాకు రావడానికి సుశాంత్ కు చి. లా. సౌ తో సాధ్యమైంది. మారుతున్న తెలుగు సినిమా కథలకు దగ్గరగా ఉండే ఈ ప్రేమకథ ఆడియన్స్ ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాడు సుశాంత్. ఫార్మెట్ కథల జోలికి వెళ్ళనంటున్న సుశాంత్ టీవీ5 తో సినిమా గురించి ముచ్చటించాడు.

ఈ కథ మీదగ్గరకు ఎలా వచ్చింది..?
రాహుల్ నాకు వేరే కథ చెప్పడానికి వచ్చాడు. ఆ కథ వింటున్న టైం లోనే ఒక పాయింట్ గా ఈ కథ చెప్పాడు. నేను వెంటనే ఈ పాయింట్ బాగుంది ఈ కథ చేద్దాం అన్నాను. నాలుగురోజుల్లో పూర్తి కథను రెడీ చేసుకొని వచ్చాడు. రెండు గంటల నెరేషన్ ఇచ్చాడు. చాలా బాగుంది అనుకున్నాను. ఇక నేను ఆలోచించుకునే గ్యాప్ ఇవ్వలేదు.చేస్తున్నాం కదా అన్నాడు. నేను ఓకే చెప్పాను.

hero sushanth special interview

అన్నపూర్ణ బ్యానర్ యాడ్ అవ్వడం ఎలా జరిగింది..?
సినిమా పూర్తి అయ్యాక ఒక షో వేశాం.. అది అందరికీ నచ్చింది. ముఖ్యంగా చైతన్య, సమంత బాగా ఇష్టపడ్డారు. నేను చేశానని కాదు. కంటెంట్ నచ్చి అన్నపూర్ణ బ్యానర్ యాడ్ అయ్యింది. ఇది చాలా సంతోషంగా ఉంది. నేను హీరో అయ్యాక నా సినిమా పోస్టర్ మీద అన్నపూర్ణ బ్యానర్ అండ్ మనం ఎంటర్ ప్రైజస్ పడటం చాలా సంతోషంగా ఉంది. ఇదనే కాదు కంటెంట్ బాగున్న సినిమాలను ప్రమోట్ చేద్దామనే కాల్ కూడా ఈ సినిమా తో నాగచైతన్య, సమంత ఇచ్చారు.

hero sushanth special interviewపెళ్ళి

మీ మీద సినిమా అంతా ఉంటుందా..?
ఆ పాయింట్ మీద ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ పెళ్ళి ప్రెజర్ ఇంట్లో మొదలవుతుంది. అయితే పెళ్ళి వద్దని కాదు.. కాస్త టైం ఇమ్మని అడిగితే అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఏం జరిగింది అనేది కథ. కథ మొత్తం ఒక రోజు లో జరుగుతుంది. సాధారణంగా థ్రిల్లర్స్, హార్రర్స్ ఒక రోజులో జరగడం చూస్తాం. కానీ ఎంటర్ టైనర్ ని ఒక రోజులో కి తెచ్చాడు దర్శకుడు రాహుల్

hero sushanth special interview

గట్టిగా కొడతా ప్రమోషన్ వీడియో కూడా మంచి రెస్సాన్స్ తెచ్చింది.. ఐడియా ఎవరిది..?
ప్రమోషన్ కోసం ఏదైనా వీడియో చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. సెల్ఫ్ ట్రోల్ చేస్తూ వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని మా టీం ని అడిగాను. చైతన్య కూడా బాగుంటుంది ట్రై చేయమంటే చేశాం అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. నా ఫ్రెండ్స్ నా మీద చేసే సాధారణ కామెంట్స్ కూడా ఇలాగే ఉంటాయి. అంటే ఫార్మెట్ కథలను కాకుండా, కొత్తదనం ఉన్న కథ లకు నేను ఓపెన్ గా ఉన్నాను. చిలాసౌ లో ఆ తేడా మీరు చూస్తారు.

hero sushanth special interview

రిలీజ్ గురించి..?
ఆగస్ట్ 3 న ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. సరదాగా ఉండే ఒక ప్రేమకథ. ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంగేజ్ చేస్తుందనే నమ్మకం నాకుంది .

hero sushanth special interview

-కుమార్ శ్రీరామనేని