కివీస్ జట్టులో భారత స్పిన్నర్‌!

క్రమ క్రమంగా ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యంలోకి భారత సంతతికి చెందిన యువరక్తం విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికా,ఇంగ్లాడ్ జట్లలో ఇప్పటికే భారత సంతతి ఆటగాళ్ళు అరంగేట్రం చేయగా న్యూజిలాండ్‌ జట్టు తరపున మరో ఆటగాడు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. భారత సంతతికి చెందిన స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ పాకిస్తాన్‌తో జరిగే మూడుటెస్టుల సిరీస్‌కు సెలక్ట్ అయ్యాడు. ముంబైకి చెందిన అజాజ్‌ ఫ్యామీలీ.. అతని చిన్నతనంలోనే న్యూజిలాండ్‌ వెళ్ళి సెటిలైంది. కివీస్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో అజాజ్‌ 48 వికెట్లు పడగొట్టి డొమెస్టిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ఇయర్‌ 2017గా నిలిచాడు.అక్కడి డొమెస్టిక్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో అజాజ్‌కు ఈ అవకాశం దక్కింది.