10 రూపాయలకే చీర.. వీడియో వైరల్

only-ten-rupees-saree in hanmakonda

హన్మకొండలో ఆడాళ్లంతా ఓ షాపింగ్ మాల్ ముందు క్యూ కట్టారు.. అదేదో వింత చూద్దామని కాదు.. చీర కొనడానికి. ఆషాడం సందర్బంగా హన్మకొండలోని ఓ షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. కేవలం 10 రూపాయలకే చీర అందించింది. ఏదైనా వస్తువు పది రూపాయలు తక్కువకు దొరికితే ఎంత దూరమైనా వెళ్లే రకాలు మనోళ్లు. అలాంటిది వందల రూపాయల విలువగల చీర కేవలం పది రూపాయలకే వస్తుండటంతో ఊళ్లకు ఊళ్లు దాటి పట్నం బాట పట్టారు. హన్మకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళాలోకం ఎగబడింది. ఏకంగా 1500 వందల మంది దాకా షాపు ముందు పడిగాపులు కాశారు. కేవలం హన్మకొండలోని మహిళలే కాక ఇతర గ్రామాల మహిళలు సైతం ఆటోలు వేసుకుని వచ్చి మరీ ఈ చీరలను కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తను చూసి అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్లు అన్ని ప్రదేశాల్లో ఉంటే ఎంత బాగుండునో అని కొంతమంది మహిళలు అంభిప్రాయపడుతున్నారు.