‘టైగర్’ హెచ్ఎం రెడ్డి పాత్రలో కైకాల

pic-talk-kaikala-as-hm-reddy-for-ntr

కైకాల సత్యనారాయణ.. ఈ పేరంటే తెలియని వారుండరు. తెలుగు సినిమాకు ఆణిముత్యమైన సత్యనారాయణ ఆరోగ్యకారణాల రీత్యా కొంత కాలంగా సినిమాలకు దూరమయ్యారు. తాజాగా కైకాల మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంలో అయన తళుక్కున మెరవనున్నారు. కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు ‘టైగర్’ హెచ్ఎం రెడ్డి పాత్రలో కైకాల కనిపించనున్నారు. ఈ మేరకు అయన జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ అందులో పేర్కొంది.

pic-talk-kaikala-as-hm-reddy-for-ntr