బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్న బుడ్డోడు

bangladeshi-two-year-old-wins-icc-fan-week-award

ఐసీసీ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. మాజీ క్రికెటర్లకు సంబంధించి అరుదైన వీడియోలు, ఫోటోలను వెలుగులోకి తీసుకువస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన రెండేళ్ల అలీ ఆటకు ఐసీసీ ఫిదా అయింది. ఆఫ్‌ సైడ్‌ టెక్నిక్స్‌ అమోఘం అంటూ రెండేళ్ల బుడతడు క్రికెట్‌ ఆడిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో కాస్త వైరల్‌ గా మారింది. ఆఫ్‌సైడ్‌ షాట్లలో అలీని మించిన ఆటగాడిని ఇప్పటివరకు చూడలేదు అంటూ బుడతడి వీడియో చూసి క్రికెట్‌ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.