డాలర్లు మారుస్తామంటూ 20 లక్షలతో పరార్..

dollars change fraud muta halchal in hyderbad

నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అమెరికా డాలర్లు మారుస్తామంటూ పాతబస్తీకి చెందిన జాఫర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకొని ఓ ముఠా ఉడాయించింది. జాఫర్‌పై తుపాకీ గురిపెట్టి నకిలీ అమెరికా డాలర్లు ఇచ్చి ఈ గ్యాంగ్ కారులో పరారైంది. బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.