ఆ గ్యాప్ కి అలవాటు పడ్డాను – ఈషా రెబ్బ

acters eesha rebba special interview with tv5
‘సుబ్రమణ్య పురం’, ‘అంతకుముందు ఆ తరువాత’ వంటి విభిన్న చిత్రాల ద్వారా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి.. ఈషా రెబ్బ. పదహారణాల  తెలుగమ్మాయిగా ఈషాకు పేరుంది.ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్రాండ్ బాబు’ మారుతీ ఆలోచనను దర్శకుడు ప్రభాకర్ తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు. కెరీర్ లో మొట్టమొదటిసారిగా అగ్రహీరో ఎన్టీఆర్ సరసన ‘అరవిందసమేత వీర రాఘవ’ లో నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ పాత సినిమాల గురించి చెబుతారు. తారక్ డల్ గా ఉండటం చూడలేదు అంటున్న ఈ బ్యూటీతో టీవీ5 ప్రత్యేక ఇంటర్వ్యూ..
బ్రాండ్ బాబులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? 
ఇంతకుముందు చేసిన పాత్రలలలో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్.  ఈ క్యారెక్టర్ కోసం కొంత హోం వర్క్ కూడా చేశాను. మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని బాగా గమనించే దాన్ని.  దానికి దర్శకుడు ప్రభాకర్ గారు ఇచ్చే సలహాలు బాగా హెల్ప్ అయ్యాయి.
acters eesha rebba special interview with tv5
ఇందులో కామెడీ నే నమ్ముకున్నారా..? ఏదైనా ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయా..?
ఇది బ్రాండ్ ల మీద విపరీతమైన పిచ్చి ఉన్న ఒక కుర్రాడి కథ. కానీ కామెడీనే మెయిన్ కాదు. మంచి లవ్ స్టోరీ, సస్పెన్స్ ఇలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి.
 
ప్రేమ సన్నివేశాలు ఎలా ఉంటాయి..? 
కాస్త సినిమాటిక్ గానే ఉంటుంది. వాళ్లెలా కలుస్తారు వాళ్ళ ప్రేమ సన్నివేశాలన్నీ సరదాగా, ఫన్నీ వే.. లో ఉంటాయి. కామెడీ చేయాలి అని చేయను.. కానీ మా మద్య సన్నివేశాలు కామెడీని జనరేట్ చేస్తాయి.
సినిమా పై దర్శకుడు మారుతి ఇంపాక్ట్ ఎంత ఉంది..?
ఆయన బ్రాండ్ కనిపిస్తుంది. ఆయనే కథ, మాటలు అందించారు. మారుతి గారి సినిమా అనుకోవచ్చు.
మారుతి గారి ఆలోచనలు ప్రభాకర్ గారు తెరమీదకు తెచ్చారు.
acters eesha rebba special interview with tv5
ఈ సినిమా చేయడానికి కారణం..?
మొదటి కథ నచ్చింది, తర్వాత  నా క్యారెక్టర్ నచ్చింది. ఈ రెండు నచ్చాకే సినిమా చేశాను.
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లో నెగ్గుకు రావడం కష్టమా..?
ఇక్కడ అందరి కష్టం ఒక్కటే. ఎందుకుంటే ఏదీ ఒక రోజు లో మారిపోదు, జరగదు.  వెంటనే హిట్లు పడిపోవాలి, స్టార్ డమ్ లోకి రావాలి అంటే జరగదు. స్ట్రగుల్ ఉంటుంది. కానీ టాలెంట్ ఉంటే ఆఫర్స్ తప్పకుండా వస్తాయి.
సక్సెస్ వచ్చాక వచ్చే గ్యాప్ ని ఎలా అర్దం చేసుకోవచ్చు..?
నేను మొదట్లో కాస్త అప్ సెట్ అయ్యాను కానీ ఇప్పుడు పాజిటివ్ వే లో చూస్తున్నాను. నాకొస్తున్న ఆఫర్స్ లో నాకు నచ్చిన సినిమాలే చేశాను. నాకొచ్చిన కథలన్నీ ఒపిగ్గా వింటాను. వాటిలో నేను చేయగలను అనుకున్నవి చేస్తాను.
‘అరవింద సమేత వీరరాఘవ’ లో చేస్తున్నారు ఎలా ఉంది ఆ మూవీ ఎక్స్ పీరియన్స్..?
నేను ఆ మూవీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు ఉన్న వారు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు అమ్మాయి చేస్తుందని. నామీద నమ్మకంతో ఆ ఆఫర్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. ఫస్ట్ షెడ్యూల్ అయ్యింది. రెండో షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం. త్రివిక్రమ్ గారు పాత సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతారు. తారక్ డల్ గా ఉండటం చూడలేదు. అంత ఎనర్జిటిక్ గా ఉంటారు. మొదట్లో కొంత టెన్షన్ పడ్డాను. తర్వాత ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండి నన్ను ఫ్రీ చేశారు. నేను ఆ ఫేజ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
acters eesha rebba special interview with tv5
-కుమార్ శ్రీరామనేని

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.