పవన్ పై జగన్ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే : ఎంపీ కొత్తపల్లి గీత

mp kotthapalli geetha comments on ys jagan

పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయటం ముమ్మాటికీ తప్పేనన్నారు ఎంపీ కొత్తపల్లి గీత. వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా చంద్రబాబు, జగన్ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. నిజాలను చెప్పినందుకు తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని దాడులు చేసినా తాను మరింత దృఢంగా ముందుకు పోతానన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -