సంచలనం సృష్టించిన పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్

pakistan-elections-2018-pti-chief-imran-khan-set-become-new-pm

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల పోరాటం అనంతరం పాక్ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టబోతున్నారు. మెజారిటీకి అడుగు దూరంలో ఆగిపోయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ.. ఇండిపెండెంట్లు, ఇతర సభ్యుల మద్దతుతో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్‌ పార్లమెంటులో మొత్తం 272 స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 137 సీట్లు ఉండాలి. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌(పీటీఐ) 119 స్థానాలను కైవసం చేసుకుంది.ఇక పీటీఐ తో నువ్వా నేనా అంటూ పోటీ పడిన పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి 63 సీట్లు దక్కాయి. ఇక పీపీపీ 38 స్థానాలను, ఇతరులు 50 స్థానాలను దక్కించుకున్నారు.