కోడిగుడ్లు దొంగతనం చేసిన కానిస్టేబుల్..

Police Eggs Robbery Recorded In Tirupati

దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబుల్ చిల్లర దొంగగా మారాడు. కోడిగుడ్లను కొట్టేసి చేతివాటం ప్రదర్శించాడు. తిరుపతి కోర్లగుండ జంక్షన్ దగ్గర్లో ఓ షాపులోకి వెళ్లిన కానిస్టేబుల్…జనంతో పాటే నిలబడ్డాడు. కోడిగుడ్లను కొంటున్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. చేతిలో నాలుగు కోడిగుడ్లను తీసుకొని అమాంతంగా జేబులో వేసుకొని వెళ్లిపోయాడు. తనను ఎవరు చూడలేదనుకున్నా..సీసీ కెమెరాకు దొరికిపోయాడా దొంగ పోలీస్. పోలీసులంటేనే చేతివాటంలో స్పెషలిస్ట్ లు అనే పేరుంది. అంతో ఇంతో సమర్పించుకోనిదే ఏ పని చేయరనేది ఓపెన్ సీక్రెట్. కానీ..మరీ ఇంత కక్కుర్తికి దిగజారిపోవడమే విడ్డూరంగా ఉంది. లంచాల మచ్చతో పాటు ఇలా చిల్లర దొంగతనాలకు పాల్పడటంతో పోలీసుల పరువు తీస్తోంది.