‘నా భార్యతో నీకేంట్రా పని’.. వీడియో వైరల్

talking-his-wife-haryana-man-thrashes-youth

కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం లవ్లీ అనే స్నేహితుడితో బైక్‌పై వెళ్తున్నాడు కరమ్‌జీత్‌. ఇంతలో బస్టాండ్‌కు సమీపంలో కరమ్‌జీత్‌ భార్య, తన చిన్ననాటి స్నేహితుడు మందమ్‌ సింగ్‌తో మాట్లాడుతూ కనిపించింది. దీంతో అక్కడికి వచ్చాడు కరమ్‌జీత్‌. అతడు తన స్నేహితుడని పరిచయం చేసింది భార్య.ఇంతలో షేక్ హ్యాండ్ తీసుకుందామని మందమ్‌ సింగ్‌ తన చెయ్యిని కరమ్‌జీత్‌ కు అందించబోయాడు.. ఇంతలోనే ‘నా భార్యతో నీకేంట్రా పని’ అంటూ మందన్‌పై పిడిగుద్దులు గుప్పించాడు కరమ్‌జీత్‌. వద్దని భార్య వేడుకుంటున్నా.. ఆమెను పక్కకు తోసేశాడు. ఇంతలో కరమ్‌కు అతని స్నేహితుడు లవ్లీ కూడా తోడుకావటంతో అతడిని తీవ్రంగా కొట్టారు.

ఇంత జరుగుతున్న స్థానికులు వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప..మందమ్‌పై రక్షించే యత్నం చేయలేదు. పైగాఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశారు. దాంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మందన్‌ను ఆస్పత్రికి చేర్పించి. దాడికి పాల్పడిన కరమ్‌జీత్‌ అతడి స్నేహితుడు లవ్లీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలావుంటే నిత్యం అనుమానంతో తన భర్త వేధించేవాడని కరమ్‌జీత్‌ భార్య పోలీసులకు వెల్లడించింది. ఈ మేరకు భర్తపై ఫిర్యాదు కూడా చేసింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -