సైకిల్ తొక్కుతూ కిందపడ్డ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్

tej-pratap-yadav-goes-for-a-cycle-ride-takes-a-tumble-watch

ఆర్జేడీ నేత.. మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్‌ తొక్కుతూ కింద పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు తేజ్‌. అయితే ఆయన సైకిల్‌కు సమాంతరంగా వెళ్తున్న మరో వాహనం ఢీ కొనడంతో తేజ్‌ కింద పడ్డారు.. అప్రమత్తమైన పోలీసులు.. తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పైకి లేపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పాట్నాలో ఆర్జేడీ ఆధ్వర్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్‌తో పాటు పార్టీ కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎరుపు రంగు టోపీ, నీలం రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించిన తేజ్ ప్రతాప్ యాదవ్..పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్నందున ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళ్లడం ఉత్తమమని తేజ్‌ అభిప్రాయపడ్డారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -