అమెరికా రాయబార కార్యాలయం దగ్గర భారీ పేలుడు

బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఎంబసీ దగ్గర ఘటన జరగడంతో కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎంబసీ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుళ్లకు ఎవరు పాల్పడారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ పని చేసింది ఎవరన్న కోణంలో వేట ప్రారంభించారు.

అమెరికా చైనా మధ్య ఇటీవలి కాలంలో ట్రేడ్ వార్ కొనసాగుతోంది. మాటల యుద్ధాలు కంటిన్యూ అవుతున్న సమయంలో బీజింగ్‌లో అమెరికన్ ఎంబసీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది.