పైతాన్‌తో ఆటలా.. మెడలో వేసుకుని..

అడవుల్లో సంచరించే జంతువులు అన్నీ జనం మధ్యలో తిరిగేస్తున్నాయి. మనుషులు కూడా వాటికి భయపడడం మానేసి పట్టుకుని బంధించేసి.. ఆనక వాటితో ఆటలాడుతున్నారు. అస్సాం గౌహతి పట్టణంలోని జాలుక్‌బరీ ఏరియాలోకి ఎక్కడినుంచో ఒ పైతాన్ వచ్చింది. దాన్ని చూసిన స్థానికులు మొదట భయపడిపోయారు.

తరువాత పాములు పట్టే వారికి సమాచారం అదించడంతో వారు వచ్చి దాన్ని ఓ సంచిలో బంధించారు. పది అడుగుల పొడవు, 16 కిలోల బరువు ఉన్న పైతాన్‌తో కొద్ది సేపు ఆటలాడారు. మెడలో వేసుకుని స్థానికుల కోసం తమ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఆతరువాత దాన్ని తీసుకు వెళ్లి దట్టమైన అడవిలో వదిలిపెట్టారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -