అందుకోసం తప్పుడు పనులు చెయ్యాలా : నటి పూజాకుమార్

actress-pooja-kumar-opens-up-on-casting-couch

కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సినీఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసందే.అవకాశాల కోసం వెళ్లిన తమను ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారంటూ నటి శ్రీరెడ్డి ఆందోళనకు దిగారు. అలాగే కొందరు సినీ ప్రముఖులపై కూడా ఆరోపణలు చేశారు. తాజాగా అది మరవక ముందే మరో నటి కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. విశ్వరూపం, గరుడ వేగ, నటించిన హీరోయిన్ పూజాకుమార్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ను మీరు ఎప్పుడైనా ఎదుర్కున్నారా..? అన్న ప్రశ్నకు.. ‘తానెప్పుడూ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోలేదని.. బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయా? టాలెంట్ ఉంటే అవ‌కాశాలు వాటంతటవే వ‌స్తాయ‌ని, త‌ప్పుడు ప‌నులు చేసి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసుకోవ‌డం అవ‌స‌ర‌మా’ అంటూ పూజాకుమార్ సమాధానం ఇచ్చింది.