నల్ల మిరియాలు.. రోజుకి రెండు నోట్లో వేసుకుంటే..

ఇళ్లలో పెద్దవాళ్లు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు లాంటివి వస్తే రెండు మిరియం గింజలు దంచి వేడి వేడి పాలల్లో కలిపి తాగితే తగ్గుతుందంటూ ఓ మంచి సలహా ఇస్తారు. అన్నింటికీ మందులు మంచివి కావంటూ హితబోధ చేస్తారు. ఈతరం అమ్మాయిలూ, అబ్బాయిలకు ఏది వచ్చినా తట్టుకోలేరు. ఒకవేళ వచ్చినా వెంటనే తగ్గిపోవాలి. దాన్ని భరించే టైం లేదంటూ బయటకు చెక్కేస్తారు ఏదో అర్జంట్ పని ఉందంటూ. లేదంటే అమ్మా అయ్యా అంటూ ఆ మాత్రం దానికే మంచి ఎక్కి ముసుగు పెట్టేస్తారు. మరి ఈ నల్ల మిరియాలు జలుబు దగ్గుతో పాటు మరిన్ని వ్యాధులకు మందులా పని చేస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం..
* వీటిల్లో విటమిన్ ఎ,సి,కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్దమైన మెటబాలిక్ వంటివి శరీరానికి బూస్టర్‌లా పనిచేస్తాయి.
* వంటకాల్లో రుచి కోసం వాడినా అందులో ఆరోగ్య గుణాలు ఉన్నాయనేది నిగూఢ రహస్యం.
* బ్లాక్ పెప్పర్‌గా పిలుచుకునే నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి. కొత్త ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవకుండా చూస్తాయి.
* కొంచెం ఘాటుగా ఉన్నా తినగలిగిన వారు రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది.
* రోజూ మీరు తాగే టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది.
* లేదంటే మజ్జిగలో కూడా వేసుకుని తాగవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* మార్కెట్లో బ్లాక్ పెప్పర్ ఆయిల్ రూపంలో కూడా దొరుకుతుంది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే గ్లాసు నీటిలో ఒక చుక్క ఆయిల్ వేసుకుని తాగితే అధిక బరువుపై ప్రభావం చూపిస్తుంది.
* రెండు, మూడు స్పూన్ల మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి బాధించే నొప్పులు ఉన్నవారు అక్కడ కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.
* అజీర్ణ సమస్యలతో బాధపడే వారు మిరియాలపొడికి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -