విమాన టాయ్‌లెట్లో పసిపాప.. నోట్లో టిష్యూ ఉంచి..

అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది టాయ్‌లెట్లో మృత శిశువుగా కనిపించింది. బుధవారం ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమాన సిబ్బందికి టాయ్‌లెట్లో ఈ దృశ్యం కనిపించింది.

పసిపాప నోట్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కుక్కి ఉంచారు. సిబ్బంది చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళకు పురిటి నొప్పులు వచ్చి టాయ్‌లెట్లోనే ప్రసవించి ఉండవచ్చని విమాన సిబ్బంది భావిస్తున్నారు.

అయితే బిడ్డను అలానే వదిలేసి ఎందుకు వెళ్లింది అర్థం కావడంలేదని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు.