కాలిఫోర్నియా అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు

carr-fire california

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా అటవీప్రాంతంలో మంటలు చెలరేగి ఉదృతరూపం దాల్చాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా …. పలు ఇళ్లు, వ్యాపార సముదాయాలు కాలిపోయాయి. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఆప్రాంతంలో విద్యుత్, రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇప్పటివరకు 28వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నికీలలు వేగంగా దూసుకొస్తుండటంతో సమీపంలో నివాసమున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైల్డ్ ఫైర్ కారణంగా స్థానికులతోపాటు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ ప్రతినిధి స్కోట్ మెక్ లిన్ తెలిపారు. 17వందల అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.

carr-fire california