ఫిల్మ్‌ఫేర్‌లో జాన్వీ అందాలు.. కవర్ పేజీపై..

అమ్మ అందాన్ని తనలో ఇముడ్చుకుని అందంగా కనిపిస్తున్న జాన్వీ తాను నటించిన మొదటి సినిమా థడక్‌తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలో నటించినా ఎక్కడా ఎక్స్‌పోజింగ్‌కి ఆస్కారమివ్వకుండా సంప్రదాయబద్దంగా కనిపించింది.

మరి అలానే ఉంటే కష్టమని మరిన్ని సినిమాల్లో నటించాలంటే ఓ అడుగు ముందుకేయాలనుకుందో ఏమో హాట్ ఫోటో షూట్ చేసింది. ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కోసం చిలిపిగా, యువహృదయాలను కవ్విస్తూ ఫోజులిచ్చింది.

ధడక్‌ హీరో ఇషాన్‌తో కలిసి షూట్‌లో పాల్గొంది. తాజా సంచికలో అందమైన కవర్‌పేజీగా ఆకర్షిస్తున్నారు ఇషాన్, జాన్వీలు.