భర్తను చంపిన స్వాతికి బెయిల్ వచ్చినా.. ఏ దిక్కూ లేక చివరికిలా…

twist-nagar-kurnool-swathi-case

ప్రియుడు తో కలిసి భర్తను హత్య చేసి ఆపై భర్త ప్లేసులో ప్రియుడిని సెట్ చెయ్యాలనుకున్న స్వాతికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాగర్ కర్నూల్ మున్సిఫ్ కోర్టు. న్యాయసేవా సంస్థ తరపున స్వాతికి బెయిల్ ఇప్పించారు న్యాయవాది విజయ్ మోహన్. నేడు జిల్లా జైలు నుంచి విడుదలైన స్వాతి ఆశ్రయం ఎక్కడన్న సస్పెన్స్ నెలకొంది. స్వాతిని తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు ఇష్ట పడటం లేదు. దీంతో ఆమెను స్టేట్ హోం కు తరలిస్తున్నారు. కొద్ది రోజులపాటు స్టేట్ హోమ్ లోనే ఆమెను ఉంచి ఆ తరువాత హైదరాబాద్ లోని ఏదైనా స్వచ్చంద సంస్థకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.

నాగర్ కర్నూల్ కు చెందిన స్వాతి, సుధాకరరెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెళ్ళైన కొన్నేళ్ళకు రాజేష్ అనే యువకుడు పరిచయమవ్వడంతో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది స్వాతి. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇంటికి వచ్చేవాడు రాజేష్. దీంతో స్వాతి భర్త సుధాకరరెడ్డికి విషయం తెలిసి హెచ్చరించాడు. కానీ అతని మాటను ఖాతరు చేయని స్వాతి ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. అయితే వారి అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న కారణంతో సుధాకర రెడ్డిని ఇద్దరు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లో తెలిస్తే ఏమౌతుందోనని.. ప్రియుడు రాజేష్ కు యాసిడ్ పోసి తన భర్తపై దుండగులు యాసిడ్ దాడి చేశారని.. దాంతో అతనికి ప్లాస్టిక్ సర్జెరీ జరిగిందని కలరింగ్ ఇచ్చింది స్వాతి. కానీ అనూహ్యంగా సుధాకరరెడ్డి తమ్ముడు ఈ దారుణాన్ని కనుక్కోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో స్వాతి, రాజేష్ ఇద్దరూ కటకటాల పాలయ్యారు. 2017 డిసెంబర్‌ 11న స్వాతిని పాలమూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆమెకు ఎనిమిది నెలల తర్వాత బెయిల్ వచ్చినా బైటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.

అప్పటినుండి జైల్లో మగ్గుతున్న ఆమెకు కోర్టు ఈ నెల 16న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు జామీను ఇవ్వడానికి కుటుంబ సభ్యులు గానీ బందువులు గానీ ముందుకు రాలేదు. దీంతో స్వాతికి బెయిల్ వచ్చినా బైటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అతికష్టంమీద జామీను లభించి ఈనెల 24న షరతులతో కూడిన బెయిల్ వచ్చి స్వాతి విడుదలైంది. కానీ స్వాతిని చూడటానికి గానీ తీసుకెళ్లడానికి గానీ ఆమె తల్లిదండ్రులు ఇష్ట పడటం లేదు. దీంతో ఆమెను స్టేట్ హోం కు తరలిస్తున్నారు.దీనికి ఆమె ఒప్పుకొని పక్షంలో జైల్లో గాని హైదరాబాద్ లోనే ఏదైనా స్వచ్చంద సంస్థకు గానీ అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.