‘సాక్ష్యం’ మూవీ రివ్యూ

Saakshyam movie review

ప్యాకేజ్ స్టోరీస్ తో విసిగిపోయిన ప్రేక్షకులకు సాక్ష్యం ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. కొత్త కంటెంట్ ని చూడబోతున్నాం అనే ఫీల్ ని విడుదలకు ముందే ప్రేక్షకులకు కలిగించడంలో సాక్ష్యం టీం సక్సెస్ అయ్యింది. ప్రకృతి నుండి ఎవరూ తప్పించుకోలేరు అనే థీమ్ ని పరిచయం చేసిన శ్రీవాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక మంచి ప్రయత్నం చేశాడు అనే టాక్ ఇండస్ట్రీ లో బాగా వినిపించింది. మరి ఇలాంటి అంచనాలతో మొదలైన సాక్ష్యం ప్రేక్షకుల ఏం సాక్ష్యం ఇస్తారో తెలుసుకుందాం..

కథ:
మునిస్వామి (జగపతిబాబు) తన తమ్ముళ్ళతో కలసి అరాచకాలు చేస్తుంటాడు. తన ఊరిలో తన అరాచకాలకు అడ్డుతగులుతున్నాడని ఒక కుటుంబాన్ని దారుణంగా తన తమ్ముళ్ళతో కలసి చంపేస్తాడు. ఆ కుటంబం నుండి ప్రాణాలతో బయటపడిన యేడాది బాలుడు (బెల్లంకొండ శ్రీనివాస్) ని పిల్లలు లేని దంపతులు దత్తత చేసుకొని తమతో పాటు అమెరికా తీసుకెళ్తారు. వీడియో గేమ్ డెవలెపర్ గా మారిన విశ్వ, సౌందర్యలహరి ( పూజా హెగ్డే)ని ప్రేమిస్తాడు. తన ప్రేమ విషయం లో ఇండియా కి వచ్చిన విశ్వా తన కుంటుంబాన్ని చంపిన వారిలో ఇద్దరి చావులకు కారణం అవుతాడు. తన గతం విశ్వాకు తెలిసిందా..? వారి చావులకు విశ్వా కారణం అవడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా..? అనేది మిగిలిన కథ..?

కథనం:
మారుతున్న తెలుగు కథలకు సాక్ష్యం ఈ సాక్ష్యం . కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ఇష్టపడే వారికి సాక్ష్యం చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమాని మొదలు పెట్టడంలోనే దర్శకుడు శ్రీవాస్ తను చెప్పదలుచుకున్న పాయింట్ ని బలంగా చెప్పాడు. శరత్ కుమార్ , మీనా చనిపోయే ఎసిసోడ్ నుండే థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. ఆవు దూడ ఏపిసోడ్ చాలా బాగుంది. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ ని కెమరా తో కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా చెప్పాడు మ్యూజిక్ దర్శకుడు హార్షవర్దన్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకి నాయక తర్వాత మరో బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ కమర్షియల్ కథలకుండే ఎలిమెంట్స్ ని ఏమాత్రం మిస్ అవని ఈ కొత్త కథ తప్పకుండా అతని కెరియర్ లో మెమరబుల్ గా మిగిలుతుంది. పంచభూతాలు, ప్రకృతి మనిషి చేసే మంచి చెడులకు సాక్ష్యం అనే పాయింట్ ని కథనంలో చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు దర్శకుడు శ్రీవాస్. ఒక షాకింగ్ సీన్ తో మొదలైన సినిమా లో అమెరికా ఎపిసోడ్ సరాదాగా సాగుతుంది. హీరో ఇండియా వచ్చి ప్రకృతి చేసే ధర్మంలో ఎలా బాగం అవుతాడు అనే పాయింట్ ని ఎలివేట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. రావు రమేష్ కోర్ట్ సీన్ చాలా బాగుంది. ‘ చావడం ధర్మం దానిని నేను గౌరవిస్తాను’ అనే లోతైన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మంచి మాటను విన్నాం అనే భావన కలిగిస్తాయి. హీరో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తే అది అతని ధర్మం అవుతుంది. కానీ తన ముందు జరిగిన అన్యాయానికి ప్రకృతే న్యాయం చేయాలనకుంటే దానికి అతను సాక్ష్యం అవుతాడు. కథనం లో ఒక హాత్య జరిగాక దానికి పార్లర్ గా ఒక వీడియో గేమే డవలపర్ అయిన హీరోకి తన జీవితం తన కళ్ళముందుకు తెచ్చే సన్నివేశాలు మరింత ఉత్కంఠగా మారాయి. పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది. పాటలకు మాత్రమే పరిమితం కాకుండా కథను ముందుకు తీసుకెళ్ళడంలో కూడా సాయపడంది. ఇక ఫైట్స్ విషయానికి వస్తే మైనింగ్ క్వారీ లో జరిగే ఫైట్ చాలా బాగా డిజైన్ చేసాడు పీటర్ హెయిన్స్ . చిన్న పిల్లలను బానిసలుగా చేసే క్వారీ వ్యవస్థలోని కొందరి చీకటి జీవితాలను అద్దం పట్టాడు. సెకండాఫ్ చాలా ఫాస్ట్ గా ఇంట్రెస్టింగ్ గడిచిపోయింది. ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ లో సినిమా కాన్సెప్ట్ మరింత ఎలివేట్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా తో ఆర్టిస్ట్ గా మరింత ఎదిగాడనిపించింది. ఎమోషనల్ సీన్స్ నుండి ఫైట్స్ వరకూ అతను చాలా ఎగ్రిసివ్ గా చేసాడు. పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా మెప్పించాడు. కథ, కథనాలలో కొత్తదనం నింపుకున్న సాక్ష్యం బెల్లంకొండ శ్రీనివాస్ ని మరింతగా మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. శ్రీవాస్ దర్శకుడిగా తన తన స్థాయిని పెంచుకున్నాడు. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా కాన్సెప్ట్ ని కాంప్రమైజ్ చేయలేదు నిర్మాత అభిషేక్ నామా. సాక్ష్యం మారుతున్న కథలకు మాత్రం సాక్ష్యం గా మిగులుతుంది.

చివరిగా:
కమర్షియల్ కోణాలు ఎక్కడా మిస్ అవ్వని సాక్ష్యం కొత్త కథ, కథనాలతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.