భారీ వడగళ్ల వాన.. విమానం అత్యవసర ల్యాండింగ్..

tianjin-airlines-aircraft-made-emergency-landing-central-china

చైనాకు చెందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. భయంకరమైన వడగళ్ల వాన కురవడంతో విమానాన్ని దించేశారు పైలట్లు. చైనా టియాన్‌జిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్‌జిన్‌ నుంచి హైనాన్‌కు బయలుదేరింది. ఇంతలో విమానం గాల్లో ఎగురుతుండగానే బరి వడగాళ్ల వాన కురిసింది. దీంతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని గ్రహించిన ఫైలెట్లు అత్యవసర ల్యాండింగ్ కు ఉపక్రమించారు. అయితే అప్పటికే విమానం ముందు భాగం, అద్దాలు పగిలిపోయాయి. కాగా వడగళ్ల వాన సమయంలో విమానంలోని ఇద్దరు పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, సమీపంలోని వుహాన్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.