శనివారంనుంచి యధావిధిగా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు… గ్రహణ సమయానికి ఆరుగంటల ముందే ఆలయ తలుపులను మూసివేశారు. తిరిగి శనివారం ఉదయం 4.15 నిమిషాలకు ఆలయంలో శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు… ఉదయం ఏడుగంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు… గ్రహణం కారణంగా వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా మూసివేశారు… అలాగే ప్రతి నెలా నిర్వహించి పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసినట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -