యువతిని వేధించారని యువకులకు అర గుండు.. రూ.30వేల ఫైన్‌

స్వాతంత్ర్యం సిద్ధించి, 70 ఏళ్లు దాటినా చాలా ప్రాంతాల్లో ఆటవిక రాజ్యమే నడుస్తోంది. పోలీసులు, చట్టాలు, కోర్టులను లెక్క చేయకుండా కొందరు గ్రామ పెద్దలు తమకు నచ్చిన తీర్పు ఇస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన యువతిని వేధించారంటూ ఖమ్మం జిల్లాలో ఓ ఊరి పెద్దలు ఇద్దరు యువకులకు గుండు గీయించారు.

చింతకాని మండలం నాగులవంచకు చెందిన ఇద్దరు యువకులు గంధసిరికి చెందిన యువతిని వేధించారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఊర్లో పంచాయితీ పెట్టారు. తప్పు చేసినందుకు అర గుండు గీయాలని తీర్పు చెప్పారు. అంతేకాదు 30 వేల చొప్పున జరిమానా విధించి వసూలు చేశారు. ఊరందరి ముందు గుంజీలు తీయించారు. గ్రామ పెద్దల తీర్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.