ఆకాశంలో అద్భుతం.. చంద్రగ్రహణానికి తోడు మరో గ్రహం

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. దీంతోపాటు అరుణ గ్రహం మరింత దగ్గరగా కనిపించనుంది.. 15ఏళ్ల తర్వాత భూమికి చేరువగా అంగారకుడు రాబోతున్నాడు. సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లడ్‌ మూన్‌తోపాటు అంగారక దర్శనానికీ ఆకాశం వేదిక కానుంది.

గ్రహణం ఏర్పడే సమయంలో భూ వాతావరణం గుండా పయనించే కాంతి చంద్రుడిపై పడుతుంది. దీంతో జాబిల్లి రక్త వర్ణంలో కనిపిస్తుంది. ఈ పరిణామాన్నే బ్లడ్‌మూన్‌గా పిలుస్తారు. భారత్‌, మెడగాస్కర్‌, ఆస్ట్రేలియాలతోపాటు దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోనూ ఈ బ్లడ్ మూన్ కనివిందు చేయనుంది. భారత్‌లో ఈరోజు రాత్రి 11.44 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలవుతుంది. అర్ధరాత్రి ఒంటి గంటకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. తెల్లవారుజామున 2.43 నిమిషాల వరకూ కొనసాగుతుంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -