పిన్ నంబర్ ఎంటర్ చేయకుండానే నగదు ట్రాన్స్ ఫర్.. (వీడియో)

Remove term: be carefull on plastic money trancefer be carefull on plastic money trancefer

ఇప్పటికే సైబర్ నేరగాళ్లతో సతమతమవుతున్నారు వివిధ వర్గాల ప్రజలు. ఎప్పుడు ఏది హ్యాక్ చేస్తారోనని టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కన్నా అంతో ఇంతో మేలనుకుంటున్న ప్లాస్టిక్ మనీ ట్రాస్ఫర్ లో కూడా మోసాలు మొదలయ్యాయి. కార్డు స్వైప్ చేస్తేగాని ట్రాన్స్ ఫర్ర్ అవని నగదు.. ఇప్పుడు ఆలా చేయకుండానే ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రూఫ్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ వ్యక్తి కార్డు స్వైపింగ్ మెషిన్ తో మరోవ్యక్తి జేబు దగ్గర పెట్టాడు. దాంతో నగదు ట్రాన్స్ ఫర్ అవ్వడంతో పాటు రుజువు స్లిప్ రావడం విస్మయానికి గురిచేస్తోంది.సాధారణంగా సెన్సార్ సంబంధిత స్వైపింగ్ మెషిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ జేబులో ఉండీ.. అదికూడా ఎటువంటి పిన్( పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఎంటర్ చేయకుండానే ఇలా నగదు ట్రాన్స్ ఫర్ అవ్వడంపై జాగ్రత్త వహించాలంటున్నాడు ఆ వ్యక్తి.. సో బి కేర్ ఫుల్.