తెలంగాణ రాజకీయాలపై చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు

ex-central-minister-chidamberam-intresting-comments-on-telangana-comments

తెలంగాణ రాజకీయాలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు, అంతకంటే బలంగా మనం ఎదుర్కోవాలని అన్నారు. శక్తియాప్‌ సమీక్ష కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. PCC చీఫ్ ఉత్తమ్ సహా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే.. శక్తి యాప్ ద్వారా లీడర్‌కు, క్యాడర్‌కు మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 25 మంది పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసుకొని వాళ్లను శక్తి ఆప్‌లో చేర్పించాలన్నారు. అటు, 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని PCC చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలమన్న ఆయన.. రాహుల్ సూచనలతో 2019 ఎన్నికలకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చిదంబరం పాత్ర మర్చిపోలేమని ఉత్తమ్ అన్నారు. శక్తి యాప్‌లో రిజిస్టర్ అయిన కార్యకర్తల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందన్నారు.