చంద్రగ్రహణ సమయంలో భూమికి అత్యంత సమీపంగా కుజుడు..

21వ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం యావత్‌ ప్రపంచానికి కనువిందు చేసింది. గ్రహణ సమయంలో సూర్యుడి కిరణాలు భూమి అంచులమీదుగా ప్రసరించడంతో… చంద్రుడు ఎర్రటి వర్ణంలో మురిపించాడు. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆఫ్రికా దాకా… అరుణవర్ణంలో మెరిసిపోయిన చంద్రుడ్ని చూసి జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. చంద్రగ్రహణ సమయంలో కుజుడు కూడా భూమికి అత్యంత సమీపంగా.. అంటే 3.6 కోట్ల మైళ్ల దగ్గరికి వచ్చాడు. దీంతో ఖగోళ ప్రియులు టెలిస్కోపుల్లో అంగారకుడిని వీక్షించారు.

దేశవ్యాప్తంగా చంద్రగ్రహాణాన్ని వీక్షించేందుకు ప్రజలు అర్ధరాత్రి బయటకు వచ్చారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో ఎర్రని జాబిల్లిని చూసి ఆనందించారు. సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల్లోని ప్లానిటోరియాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో, చిన్నాపెద్దా తేడా లేకుండా టెలిస్కోపుల్లో అంగారకుడ్ని చూసేందుకు పోటీ పడ్డారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -