మహిళలను చితక్కొట్టిన మెక్‌డొనాల్డ్‌కు ఉద్యోగులు

మెక్‌డొనాల్డ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఓ కస్టమర్‌ని చితక్కొట్టారు. ఈ సంఘటన అమెరికాలో వెవాడలో చోటుచేసుకుంది. వీరి మధ్య జరిగిన గొడవ సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళా కస్టమర్‌, మెక్‌డొనాల్డ్‌ ఉద్యోగినికి మధ్య జరిగిన గొడువ ముష్టిఘాతాలవరకు వెళ్ళింది. ఉద్యోగిని తల్లిని సదరు కస్టమర్‌ దూషించడంతో ఈ వివాదం చెలరేగింది. వారు ఫైట్‌ను చూసిన చుట్టుపక్కల వారు
ఆపేందుకు ప్రయత్నించారు. ఇంతలో మరో ఉద్యోగిని వచ్చి కస్టమర్‌ను పక్కకు లాగి చితక్కొట్టింది.ఈ ఘర్షణ సంబంధించిన వీడయా సోషల్ మీడియాలోవైరల్ మారడంతో మెక్‌డొనాల్డ్‌ ఫ్రాంఛైజీ యజమాని బ్రెంట్‌ భోన్‌ స్పందించారు. ఈ గొడువపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. దర్యాప్తులో నిజనిజాలు ఎంటో తెలుస్తాయని వెల్లడించారు