నా పెళ్లి.. స్పందించిన తమన్నా

tamannah-responds-her-marriage-rumours

గత కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లివార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె త్వరలోనే అమెరికాకు చెందిన డాక్టర్ ను వివాహమాడనున్నట్టు ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. పైగా తమన్నా ఇప్పటికే పలువురు తోటి నటీనటులను పెళ్ళికి రావాల్సిందిగా ఆమె కోరారని ఆ రూమర్ల సారాంశం.. అయితే వీటిపై ట్విటర్ లో స్పందించారు నటి తమన్నా.. ‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్‌, ఇప్పుడేమో డాక్టర్‌.. నేనేమి భర్తల షాపింగ్‌ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నా పేరెంట్స్‌ కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం చట్ట ప్రకారం, గౌరవప్రదంగానూ మంచిది కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా’ అంటూ తమన్నా ట్వీట్‌ లో పేర్కొన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -