ఒంగోలు గడ్డపై గర్జించిన సీఎం..

Remove term: tdp dharmaporatadeeksha in ongole tdp dharmaporatadeeksha in ongole

ఒంగోలులో సీఎం చంద్రబాబు గర్జించారు. కేంద్రంపై తనదైన స్టైల్లో నిప్పులు చెరిగారు.. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ తనపై చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.. కేవలం విమర్శలు చేయడమే కాదు ప్రధానికే సవాల్‌ విసిరారు. ఏపీలో విపక్షాల తీరును ప్రజా క్షేత్రంలో ఎండగట్టారు..

ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపట్టిన ధర్మపోరాట సభలో ఆయన కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నమ్మక ద్రోహంపై తిరుపతిలో వెంకన్న సాక్షిగా తొలి ధర్మపోరాట పోరాటం నిర్వహించామని, ఇది నాలుగో సభ అని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంట్‌లో ఏపీ ప్రజల గళం అద్భుతంగా వినిపించిన ఎంపీలను చంద్రబాబు ఘనంగా సన్మానించారు..

రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లవుతున్నా విభజన హామీలు ఎందుకు అమలు చేయరని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు.. ఇంత పెద్ద రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి.. మీకు చేతకాకపోతే మేమే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించుకుంటామని.. అందుకు బదులుగా పదేళ్ల పాటు కేంద్రానికి పన్నులు కట్టడం మానేస్తామంటూ కేంద్రానికి వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు..

రాష్ట్రానికి 16 వేల కోట్ల రూపాలయ లోటు బడ్జెట్‌ ఉన్నా 24500 కోట్ల రైతు రుణమాఫీ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.. కేవలం దాన్ని సాకుగా చూపించి కేంద్రం రెవెన్యూ లోటు కింది ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. 3900 కోట్లు మాత్రమే ఇచ్చి.. మిగిలిన వాటికి ఎగనామం పెట్టారనన్నారు.. ఇప్పటికైనా ఆ నిధులు ఇవ్వకపోతే.. త్వరలోనే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు..

ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోండి అని చెప్పిన ప్రధాని కేవలం 1500 కోట్ల రూపాయల నిధులు ఇస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. విగ్రహాలకు 2500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన ఆయనకు.. రాజధానిపై ఎందుకు ఇంత చిన్న చూపు అని నిలదీశారు. రాజధానిని అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీకి.. వైసీపీ, జనసేనలు మద్దతుగా నిలవడంపై చంద్రబాబు మండిపడ్డారు..

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యం అన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 57 శాతం పనులు పూర్తి అయ్యాయని.. 2019 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని స్పష్టం చేశారు. అయితే కేంద్రం కొర్రీలు పెట్టకుండా.. నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు..

కేంద్రం తీరుపై మంత్రి లోకేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఏపీకి మోడీ సర్కార్‌ న్యాయం చేస్తుందని నాలుగేళ్లు ఓపిక పట్టి మోసపోయామని గుర్తు చేశారు. బీజేపీ అంటే భారతీయ జగన్‌ మోహన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ పార్టీ అంటూ ఆరోపించారు..

ఇక ఏపికీ ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని టీడీపీ నేతలు పిలుపు నిచ్చారు. ప్రాణాలతో ఉండి కేంద్రంపై పోరాడుదామన్నారు.. ప్రత్యేక హోదా కోరుతో చిత్తూరు జిల్లా మదన పల్లిలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్‌కు ప్రభుత్వం తరపున 5 లక్షలు, పార్టీ తరపున 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు చంద్రబాబు..

మరోవైపు ఒంగోలు సభకు వచ్చిన స్పందనతో టీడీపీ నేతల్లో నూతన ఉత్సాహం కనిపించింది. ప్రజల మద్దతు ఇలాగే ఉంటే కొండనైనా ఢీ కొంటాను అన్నారు చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలే తన ధైర్యంమని.. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు గెలిచి.. ప్రధానని మనమే నిర్ణయిద్దామని చంద్రబాబు జోస్యం చెప్పడంతో.. టీడీపీ కేడర్‌లో ఇంకాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది..

-ADVT-