విశాఖ నుంచి యూపీకి వెళ్లడానికి రైలు బోగీకి మూడున్నరేళ్ల..

రైళ్ళను సమయపాలనలో నడపడంలో ఇండియన్ రైల్వే అలసత్వం మరోసారి బయటపడింది. రైళ్ల అలస్యం రోజులకు,గంటలకు పరిమితమైన సంఘటనలే మనం చూశాం. కానీ ఓ గూడ్స్ రైలు వ్యాగన్ తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఏకంగా మూడున్నర ఏళ్ళ సమయం పట్టింది.విశాఖపట్నం నుంచి రూ. 10 లక్షల విలువైన కంపోస్ట్ ఎరువులతో బయలుదేరిన గూడ్స్ రైలు వ్యాగన్ మూడున్నర సంవత్సరాల తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని తన గమ్యస్థానానికి చేరుకుంది.

యుపిలోని బస్తి జిల్లాలో ఉన్నఇండియన్ పోటాష్ లిమిటెడ్ అనే సంస్థ 2014 నవంబరు నెలలో విశాఖపట్నం నుంచి కంపెనీకి  కంపోస్ట్ తరిలించడానికి 107462 వ్యాగన్‌ను బుక్ చేసుకుంది. అయితే ఈ వ్యాగన్ మూడున్నరేండ్లు తర్వాత యాజమాని దగ్గరకు చేరుకుంది. దీనిపై నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ స్పందించారు. వ్యాగన్ మార్గం మధ్యలో చేడిపోవడం వలన దాన్ని సిబ్బంది యార్డ్‌కు తరిలించారు. అధికారులు దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ దీనికోసం వెతికినపుడు ఇది కనిపించింది. అయితే దీనిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.దీంతో అది అలాగే ఉండిపోయిందన్నారు.తర్వాత యాజమాని ఫిర్యాదుతో దాన్ని గుర్తించినట్టు తెలిపారు.