జగన్‌ నిజస్వరూపం ఏమిటో బయటపడింది

జగన్‌ నిజస్వరూపం నిన్నటితో బయటపడిందన్నారు మంత్రి కళా వెంకట్రావ్‌. కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. జగన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో అంశమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలోనే కాపులకు ఏం చేయలేని జగన్‌.. ఇక రాష్ట్రంలోని అందరికీ ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు కళా వెంకట్రావ్‌.
అలాగే  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కూడా కళావెంకట్రావు మండిపడ్డారు. పవన్‌ పార్టీకి విధివిధానాలు లేవన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. రాజధానిని అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ఏం ఆలోచించి రాజధానిని అడ్డుకుంటామన్నారో చెప్పాలన్నారు.