బిగ్‌బాస్‌లో ఉహించని ట్విస్ట్‌.!

బిగ్‌బాస్‌ సీజన్‌-2లో రోజుకో ఆసక్తి పరిణామం చోటుచేసుకుంటుంది.ఇప్పటికే కంటెస్టెంట్స్‌ల మధ్య జరుగుతున్న వివాదాలతో బిగ్‌బాస్‌ గురించి సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజుల నుంచి హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నది ఎవరనే విషయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. గత కొద్దీ రోజుల నుంచి నూతన్‌ నాయుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఆయనతో పాటు యాంకర్‌ శ్యామల సైతం హౌస్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్టార్‌ మా రిలీజ్‌ చేసిన ప్రోమోలో సైతం ’బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మళ్లీ ప్రవేశించ బోతున్న ‘కంటెస్టెంట్స్‌’ ఎవరూ అని’ ప్రకటించడంతో ప్రేక్షకులలో సైతం ఈ విషయంపై మరింత ఆసక్తి పెంచుతోంది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపె ట్టబోయే కాంటేస్ట్‌ట్ ఎవరనేది సోమవారం ఎపిసోడ్‌లో రివీల్‌ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.