బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్..

కృష్ణా జిల్లా ఉయ్యూరులో మరో కాల్ మనీ ఉదంతం బయటపడింది. అధిక వడ్డీ బాధ బరించలేక BSNL ఉద్యోగి రాంబాబు సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. లక్ష రూపాయల అప్పు ఇచ్చి నెలకు 16వేల వడ్డీ కట్టాలని వేధిస్తున్నారని.. ఇళ్లు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని వీడియోలో రికార్డు అయింది. గత 26న జరిగిన ఈ ఘటన సెల్ఫీ వీడియోతో ఆలస్యంగా బయటపడింది. అంతకు ముందుకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.