జగన్ కు చేదు అనుభవం

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పాదయాత్రలో జగన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. జగన్ పాదయాత్రను కాపులు అడ్డుకున్నారు. తమను మోసం చేయొద్దంటూ ప్లకార్డులతో కాపు యువత.. జగన్ ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకుంది. జగ్గంపేట నుంచి రామచంద్రాపురంలోకి ఎంటర్ అవుతున్న జగన్ పాదయాత్రను తామరాడ బ్రిడ్జి వద్ద కాపు నేతలు అడ్డుకున్నారు. జగన్ భద్రతా సిబ్బంది, కాపు యువతను తోయడంతో.. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.