గర్భంతో ఉన్న మేకపై 8 మంది యువకుల అఘాయిత్యం..

మృగాళ్లు బరి తెగిస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం రాక్షస ప్రవృత్తిని బయటపెడుతున్నారు. హర్యానాలోని మేవాట్‌లో గర్భంతో ఉన్న ఓ మేకపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు.

మేక యజమానితో దురుసుగా ప్రవర్తించి, మద్యం మత్తులో మేకపై లైంగికదాడికి పాల్పడ్డారు. వీరి లైంగిక దాడితో ఆ మేక మృత్యువాత పడింది.

దీంతో మేక యజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి, మేకపై అఘాయిత్యానికి ఒడిగట్టారని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న మేవాట్ పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.