శివుడి విగ్రహం పైకి ఎక్కి మెడలో కొలువు దీరిన నాగు పాము

పెద్దపల్లి జిల్లా మంథని నది సమీపంలోని శివుడి విగ్రహం వద్ద నాగు పాము సందడి చేసింది. శివుడు విగ్రహం పైకి ఎక్కిమెడలో కొలువు దీరింది. దాదాపు అరగంట పాటు శివుడి మెడలోనే ఉండిపోయింది.

ఓవైపు శివుడి విగ్రహం పాము..మరో వైపు నిజమైన పాము చూపరులను ఆకట్టుకుంది. కొద్దిసేపు శివుడి తలపై నిల్చుంది. దీంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. దేవుడి మహిమే అంటూ భక్తులు పూజలు చేశారు.అనంతరం మెల్లగా విగ్రహం దిగి వెళ్లిపోయింది.