భారీ భూకంపం…వెయ్యి ఇండ్లు నేలమట్టం

ఇండోనేషియాలోని లాంబక్ ద్వీపాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4 గా నమోదైందని అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా దాదాపు 162 మంది గాయపడ్డారు. అలాగే భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. దాదాపు వెయ్యి ఇండ్లు నేలమట్టమయ్యాయి.వారాంతపు సెలవులుకావడంతో ఎక్కువ మంది టూరిస్టులు లాంబక్ ద్వీపాన్ని సందర్శించేందుకు వచ్చారు.మౌంట్ రిన్జానీపై ట్రేకింగ్ చేస్తున్నవారిపై కొండచరియలు విరిగిపడడంతో వీరిలో చాలా మంది మరిణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మరణించిన వారిలో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.