మీడియా ఎదుట వచ్చి చెయ్యి.. శ్రీరెడ్డికి లారెన్స్ ఛాలెంజ్..

raghava-lawrence-again-slams-sri-reddy

తనపై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు లారెన్స్..పైగా ట్విట్టర్ ద్వారా ఆమెకు ఓ ఛాలెంజ్ విసిరారు. ఇంతకుముందు శ్రీరెడ్డి ఆరోపణల తర్వాత నాకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఆమెతో వివాదం గురించి పదే పదే అడుగుతున్నారు.

దాంతో ఆమె చేసిన ఆరోపణలకు ముగింపు పలకాలని అనుకొంటున్నాను అని అంటూ.. ‘ఏడేళ్ల కిందట ప్రభాస్ తో చేసిన రెబల్ సినిమా షూటింగ్ సమయంలో నువ్వు నన్ను కలిశావు. అప్పటి నుంచి నాపై ఈ ఆరోపణలను ఎందుకు చేయలేదు?..

పైగా హోటల్ రూమ్‌లో కలిసి నీతో అసభ్యంగా ప్రవర్తించానని అన్నావు. అలాగే రూంలో రుద్రాక్షమాల, దేవుడి ఫొటోలు చూశానని చెప్పావు. హోటల్లో రుద్రాక్షమాల ఉంచుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా.. నేను నీకు సినిమా ఛాన్సులు ఇవ్వడానికి సిద్దమే.. అందుకు ఓ ప్రెస్‌మీట్ పెడతాను. మీడియా ముందు ఓ కార్యెక్టర్, సీన్ పేపర్ ఇస్తాను. యాక్టింగ్‌తోపాటు కొన్నిడ్యాన్స్ స్టెప్పులు నాతోపాటు వేసి చూపించాలి.. కేవలం సింపుల్ స్టెప్స్ మాత్రమే ఇస్తాను. నీలో నటనలో బేసిక్స్, టాలెంట్ ఉన్నాయని భావిస్తే వెంటనే నా నెక్స్ట్‌ మూవీలో ఛాన్స్‌ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్‌ కూడా వెంటనే ఇచ్చేస్తా’ అంటూ శ్రీరెడ్డికి ఛాలెంజ్ విసిరారు.