శామ్ ఏంటిది.. చైతూ షాక్

మనసులోనే కాదు మార్ఫింగ్‌తో కూడా మనపక్కన మరెవర్నో ఊహించుకోవచ్చు. మాయలెన్నో చేయొచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మ్యాజిక్కులు, మరెన్నో జిమ్మిక్కులు చేసేస్తూ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు నేటి యువత. తన అభిమాన తార సమంత పెళ్లి ఫోటోలో నాగచైతన్య స్థానంలో తనని ఊహించుకుంటూ ఫోటో పోస్ట్ చేశాడు ఓ వీరాభిమాని.

అల్లు అర్జున్ అడిక్ట్ అనే ట్విట్టర్ అకౌంటర్ ట్వీట్ చేశాడు. సమంత కూడా సరదాగా తీసుకుని ట్వీట్‌పై స్పందించింది. తొలి చూపులోనే ప్రేమించుకున్నాం. వారం రోజుల క్రితమే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమంత నటించిన యూటర్న్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

&