మీరు ఏంచేసినా ఈ పందిని వదలను.. చివరకు పైథాన్..

The Farmer Found Giant Python Snake Attacks Pig In My Village - Rescue Pig from Anaconda

అడవిలో క్రూరజంతువులకు సైతం పైథాన్ అంటే వణుకు.. అలాంటిది పందులను అవి వదులుతాయా.. జపాన్ లో అదే జరిగింది.. పచ్చిక బైళ్ళలో సంచరిస్తున్నఓ పందిని అమాంతం చుట్టేసింది ఓ భారీ పైథాన్. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. పొలంలో ఇద్దరు యువరైతులు పని చేసుకుంటున్నారు. అయితే వారి పెంపుడు పందిని గట్టున వదిలేశారు. అది ఆ పరిసరాల్లో సంచరిస్తోంది. ఈ క్రమంలో మెల్లగా ఆ పంది వద్దకు ఓ భారీ పైథాన్ వచ్చింది. అంతే దాన్ని ఒక్కసారిగా చుట్టేసి ఎముకలు పిండిఅయ్యేట్టుగా నలిపేసింది.

దీంతో అది గట్టిగా అరవడంతో పనిచేసుకుంటున్న ఆ ఇద్దరు వచ్చి పైథాన్ ను విడిపించే ప్రయత్నం చేశారు. కానీ అది ఆ పందిని విడవకుండా అలాగే పట్టుకుని ప్రాణాలు తీస్తే గాని కోపం చల్లారదన్నట్టు బుసలు కొడుతోంది. కానీ ఎలాగోలా దానిభారీ నుంచి పందిని విడిపించారు ఆ వ్యక్తులు. సమీపంలోని కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.

-ADVT-