LIVE : ఉజ్జయిని మహంకాళి రంగం కార్యక్రమం

ఉజ్జయిని మహంకాళి ఆలయ పాలకమండలిపై అమ్మవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగం సందర్భంగా మాతంగి స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు.. బోనాల సందర్భంగా భక్తులు పడ్డ బాధలను తెలియజేశారు. ఆడపడుచులందరని అగచాట్లు పెట్టారని, భక్తులకు మేలు చేయాల్సింది పోయి.. కీడు చేస్తున్నారని అమ్మవారు ఆగ్రహించారు.

ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. బిడ్డలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసన్నారు అమ్మవారు. ప్రజలకు ఎటువంటి ఆపదా రానివ్వనన్న ఆమె.. తప్పు చేసిన వారిని శిక్షిస్తా.. అమాయక ప్రజలను రక్షిస్తానని చెప్పారు.

రైతులకు ఈ ఏడాది కలిసి వస్తుందని అమ్మ భవిష్యవాణి వినిపించింది. వర్షాలు సకాలంలో కురుస్తాయని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పింది. రైతులకు ఎటువంటి ఆపదా రానివ్వకుండా కాపాడుకుంటానంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -