గల్లీ గల్లీలో కనిపించే పానీపూరీ బండి.. ఇకపై..

సాయింత్రమైతే చాలు అందరూ పానీపూరీ బండి చుట్టూ చేరతారు. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించే ఈ పానీపూరీ బండ్లు ఇప్పుడు పల్లెల్లోకి కూడా వచ్చేసాయి. వద్దన్నా వినిపించుకోని చిన్నారులు, వారి పేరు చెప్పి పెద్దవాళ్లు కూడా తినేస్తుంటారు. రోడ్డుకి పక్కగా బండిమీద పెట్టుకుని అమ్మే ఈ పానీపూరిలో కావలసినంత దుమ్మూ దూళీ, అక్కడ అపరిశుభ్ర వాతావరణం అనేక రోగాలకు నిలయమని తెలిసినా పానీపూరీ నోరూరిస్తుంది.

ఇకపై పానీపూరీ బండి రోడ్డుపై కనిపించిందంటే ఖబడ్దార్.. అంటూ గుజరాత్ వడోదర మున్సిపల్ అధికారులు ప్రకటించారు. అసలే వర్షాకాలం అందునా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడంతో బయటి తిండి తనకూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టణంలోని దాదాపు 50 ప్రాంతాల్లోని పానీపూరి తయారీ కేంద్రాలపై దాడి చేశారు.

వారి తనిఖీల్లో పాడయిపోయిన పిండి, కుళ్లిన ఆలుగడ్డలు, వాడి వాడి ఉన్న నూనె వీటిని పానీ పూరీ తయారీకి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. 4,000 కేజీల పానీపూరీలతో పాటు, కూరకు ఉపయోగించే 3,500 కేజీల శనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై పానీపూరీ ఎవరూ తయారు చేయారాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -