మరికొద్ది గంటల్లో పెళ్లి.. యాక్సిడెంట్ రూపంలో మొత్తం 13 మంది..

మనిషి జీవితంలో జరిగే అన్ని ఘట్టాలు ముగియకందే మృత్యువు ఏదో ఒక రూపంలో పలకరించేస్తుంది. నిండు జీవితాలకి ముగింపు పలుకుతుంది.

 

ఎంతో సంతోషంగా తమ ఇంట జరిగే ముఖ్యమైన వేడుకలో పాల్గొనడానికి పెళ్లి కొడుకుతో సహా బంధువులంతా 13 మంది కలిసి వ్యాన్ మాట్లాడుకుని పెళ్లి మండపానికి బయలు దేరారు దక్షిణ వియత్నాంకు చెందిన కుటుంబం. 16 సీట్లు ఉన్న ఒక వ్యాన్ మాట్లాడుకుని ఒకే కుటుంబానికి చెందిన 14 మంది వ్యానులో ఎక్కారు. కొద్ది దూరం ప్రయాణిస్తే పెళ్లి కూతురి ఇల్లు వచ్చేస్తుంది. ఆ ఆనందంలో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు.

ఇంతలో మృత్యురూపంలో ఓ కంటెయినర్ ఎదురు వచ్చింది. క్వాంగ్ నామ్‌కు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వ్యాను కంటెయినర్ ట్రక్‌ను ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో పెళ్లి బృందం వ్యాను నుజ్జునుజ్జయింది. వ్యానులోని వారందరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా ఒకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.