బైక్ డ్రైవింగ్‌ నేర్చుకొంటూ యువతి దుర్మరణం

BIKE ACCENTED T

బైక్ డ్రైవింగ్‌ నేర్చుకొంటూ అనుకోకుండా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువతి మ‌ృతి చెందింది.ఈ సంఘటన విశాఖపట్టణంలోని ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పావని(16)అనే యువతి నగరంలోని మహవీర్‌ బుక్‌ షాపులో పనిచేస్తుండేది.ఆమెకు గత కొద్ది రోజుల క్రితం ఆరిలోవ ప్రాంతం జైభీమ్‌ నగర్‌కు చెందిన కిరణ్‌తో పరిచయమైంది. అతనితో కలిసి రుషికొండ బీచ్‌రోడ్డులో బైక్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బీచ్‌ రోడ్డులో మూల మలుపు వద్ద ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఆమెకు కడుపు భాగంలో బలమైన గాయమైంది. దీంతో ఆమెను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది.