పెళ్లైనా హీరోలు రొమాన్స్ చేయొచ్చు.. మేం చేస్తే మాత్రం..- రష్మికా మందన్నా

నిన్నగాక మొన్నే ఇండస్ట్రీలోకి వచ్చింది.. చాలానే నేర్చేసుకుంది గీత.. అదేనండి రష్మికా మందన్నా.. గీత గోవిందం సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే’ అంటూ సాగే పాటలో గీత గోవిందుడితో చేసిన రొమాన్స్ ఎక్కువైందంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దానికి సమాధానంగా ఈ ముద్దుగుమ్మ ఘాటుగానే స్పందించింది. సినిమాలో మేం ఇద్దరం భార్యా భర్తలం. మరి మా మధ్య రొమాన్స్ ఉంటే తప్పేంటి? భర్త వీపుపై భార్య ఎక్కితే తప్పా? అని ప్రశ్నిస్తోంది.

హీరో హీరోయిన్ల బాధలను, సంతోషాలను తమవిగా ఫీలయ్యే అభిమానులు ఒకింత ఎక్కువగా రియాక్టవుతుంటారు. ఇంతకీ రష్మికపై అంతగా మండిపడడానికి కారణం విచారిస్తే ఆమె తన కో స్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. పెద్దలు ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.

Image result for actress rashmika in geetha govindam

అందుకే విజయ్ దేవరకొండ వీపు మీద ఎక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. గోవిందుడితో నీ రొమాన్స్ శృతి మించింది మరీ అంత మంచింది కాదు. పెళ్లి కాబోయే పిల్లవి అంటూ నీతి వాఖ్యాలు వల్లించబోయే సరికి రష్మికకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే అంత ఘాటుగా రిప్లై ఇచ్చింది. అనంత్ శ్రీరామ్ ఈ పాట ఎంత అందంగా రాశారో అంతే అందంగా రష్మిక గులాబీరంగు చీరకట్టులోని సౌందర్యం యువ హృదయాలను గిలిగింతలు పెడుతోంది.