రూ.2000 కోట్ల డ్రగ్స్ ని పట్టించిన శునకం..

colombian-drug-lord-places

సొంబ్రా.. పేరు కొత్తగా ఉందా.. కానీ కొలంబియాలో ఈ పేరు వింటేనే డ్రగ్స్ మాఫియా హడలిపోతోంది. ఎక్కడికైనా సొంబ్రా వస్తుందంటే చాలు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్. అంతటి ప్రభావం చూపుతుందన్ని సొంబ్రా ఓ పోలీస్ అధికారో.. నిఘా ఏజెన్సీనో అనుకుంటున్నారు.. కాదు.. ఓ కుక్క. అవును పోలీస్ డాగ్ ఇది. కొలంబియాలో దేశంలో వేల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఈ డాగ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కుక్క ఎఫెక్టుతో చావుదెబ్బ తింటున్న మాఫియా దీని భారీ నుంచి తప్పించుకోవడానికి ఓ ప్రకటన చేశారు. దీనిని పట్టించినా.. లేక చంపితీసుకొచ్చినా లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తామని మాఫియా ఆఫర్ చేస్తున్నారు.

ఈ పోలీస్ డాగ్ సొంబ్రా ట్రాక్ రికార్డు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన సొంబ్రా ఎంటరైతే ఏమూలన ఉన్నా డ్రగ్స్ మూలాలు బయటపడాల్సిందే. సూట్ కేసుల్లో దాచిన 2వేల కిలోల కొకైన్ పట్టించింది. అరటిపండ్లు, బోట్లు, విగ్రహాలు ఇలా ఎక్కడ దాచిన డ్రగ్స్ ను అయినా పసిగట్టి పోలీసులకు పట్టిస్తుంది. అరటిపండ్లలో ఒసారి సరఫరా చేస్తున్న 5 టన్నుల డ్రగ్స్ ను ఇది పట్టించింది. ఎవరూ గుర్తించలేని విధంగా ఓ మిషన్ లో తరలిస్తున్న 77 కిలోల కోకైన్ ను కూడా పట్టించింది. సొంబ్రా వల్ల ఇప్పటివరకూ 245 మంది అరెస్టు అయ్యారు. సొంబ్రా అంటే స్పానిష్ లో నీడ అని అర్ధం.. పేరుకు తగ్గట్టే అది మాదకద్రవ్యాల మాఫియాను నీడలా వెంటాడుతుంది.

ఇంతటి ట్రాక్ రికార్డు ఉండడం వల్లే మాఫియా సొంబ్రాను టార్గెట్ చేశాయి మాఫియా గ్యాంగులు. హిట్ లిస్టులో ఉండడంతో దీనికి భద్రత కూడా పెంచారు పోలీసులు. ఇద్దరు సాయుధులైన పోలీసులు నిరంతరం పహారా కాస్తుంటారు. ప్రత్యేక వాహనాన్ని కూడా కేటాయించారు. అనుమతి లేకుండా.. దీని దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లలేరు. తినే ఆహారం నుంచి.. అన్నింటిపైనా నిఘా ఉంటుంది. దేశానికి సేవ చేస్తున్న ఈ డాగ్ కు ఆమాత్రం సేవలు చేయడం పెద్ద విశేషం కాదంటున్నారు. మొత్తానికి విశ్వాసానికి మరోపేరుగా నిలిచింది.