60 ఏళ్ల తర్వాత దొరికాడు..కానీ..

Marinella Laporta

 

sci

సోషల్ మీడియాలో వాస్తవాల కంటే అవాస్తవాలకే ఎక్కువ చోటుంటుంది దీంతో సామాజిక మాధ్యమాలు మంచికంటే చెడును ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి అన్న అపకీర్తిని మూట గట్టుకున్నాయి. చాలా సందర్భాలలో సదుద్దేశంతో తలపెట్టిన అంశాలకు సోషల్ మీడియా అందించే కృషి మరువలేనిది. సామాజిక ఉద్యమాలకు ఈ ప్రచార మాధ్యమాలు ఇచ్చిన తోడ్పాటు అనిర్వచనీయమైనది. సమాచార మాధ్యమాలు ప్రజల పురోగతికి తోడ్పడే సాధనాలుగా ఉంటున్నాయన్నది వాస్తవం. సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చెందే వార్త అది మంచికో చెడుకో దాని ఫలితం మాత్రం ఉంటుంది. సాంకేతిక సమాచార విప్లవంలో సోషల్ మీడియా పాత్ర ఏంటి అనేది మరోసారి ఈ సంఘటన నిరూపించింది.

Image result for French skier lost 64 years ago in Alps identified with help of social media

60 ఏళ్ళ క్రితం చనిపోయిన ఓ వ్యక్తి అవశేషాన్ని చివరకు సోషల్ మీడియా తన కుటుంబం వద్దకు చేర్చింది. ఉత్తర ఇటలీలోని స్విస్ సరిహద్దు సమీపంలో ఉన్న వాల్టోయుర్న్‌చె లోయలో చనిపోయిన ఓ వ్యక్తి అవశేషాలను ఇటలీ పోలీసులు కనుగొన్నారు. ఆ అవశేషానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు దానిని స్థానిక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరిలించారు. ఆ మృతదేహానికి చెందిన కళ్ళజోడు ,దుస్తులు,వాచ్ కూడా పోలీసులకు లభించాయి.మృతదేహాన్ని పరిశోధించిన నిపుణులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తి 30 ఏళ్ళ వయస్సులో మరిణించినట్లు వారు గుర్తించారు. 50 ఏళ్ళ క్రితం అతను చనిపోయి ఉంటారని వారు అంచనా వేశారు. తన ఆచూకీ తెలుసుకోవడం కోసం ఫోరెన్సిక్ నివేదికకు సంబంధించిన అంశాలన్నింటిని వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ వార్తను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలలో ఎక్కువగా షేర్ చేయాలని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Image result for French skier lost 64 years ago in Alps identified with help of social media

దీంతో ఈ వార్త వైరల్‌గా మారి చివరకు తన కుటుంబ సభ్యులకు చేరింది . రేడియాలో ఈ వార్తను విన్న ఓ ప్రెంచ్ మహిళ చనిపోయిన వ్యక్తి తన అంకుల్ హెన్రి లే మాస్నే అని 1954 లో వచ్చిన మంచు తుపాన్‌లో అతడు కనిపించకుండా పోయాడని తెలిపింది. ఈ సమాచారం తెలుసుకున్న94 ఏళ్ళ హెన్రి సోదరుడు రోజెర్ కూడా ముందుకువచ్చారు. ” హేన్రి 64 ఏళ్ళ నుంచి కనిపించకుండా పోయాడు. అతను ప్రాన్స్ ఆర్థికశాఖలో పనిచేసేవాడని ” ఈమెయిల్ ద్వారా పోలీసులకు తెలిపాడు. అలాగే అతని ఫోటో,ఇతర వివరాలను వారికి అందించారు. దీంతో రక్త నమూనాలను సేకరించిన పోలీసులు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించారు. వారి డిఎన్‌ఎలతో అతని డిఎన్‌ఎ కూడా సరిపోవడంతో అతని బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -